NTV Telugu Site icon

Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Rajiv Gandhi Assassination Case

Rajiv Gandhi Assassination Case

Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్, ఆర్పీ రవిచంద్రన్ సహా మిగిలిన ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. మేలో విడుదలైన మరో దోషి ఏజీ పేరారివాలన్‌ కేసును పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రస్తుతం పెరోల్‌పై ఉన్న నళిని మద్రాసు హైకోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించడంతో త్వరగా విడుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తన ప్రత్యేక అధికారాలను వినియోగించడం ద్వారా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన పేరారివాలన్‌ను విడుదల చేయాలని మే 18న సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత ఆమె పిటిషన్ దాఖలు చేయబడింది. ఈ ఆర్టికల్ 142 “అత్యున్నత న్యాయస్థానం” నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ కేసులో తనను విడుదల చేయాలని నళిని శ్రీహరన్‌ పేరారివాలన్ కేసును ఉదహరించారు. తనకు కూడా పేరారివాలన్‌ లాగా ఉపశమనాన్ని కలిగించాలని కోర్టును కోరింది.

నిందితులను విడుదల చేసేందుకు తమిళనాడు సర్కారు ఇంతకు ముందే సుముఖతను వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్‌కు కూడా తెలియజేసింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన ఆదేశాలను జారీ చేసే సమయంలో కూడా గుర్తు చేసింది. వీరి విడుదలకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా సుముఖతను వ్యక్తం చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Allu Arjun: రియల్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. కేరళ నర్సింగ్ విద్యార్థిని దత్తత!

మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల సమావేశంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈ ఆత్మాహుతి బాంబర్‌చే చంపబడ్డారు. ఈ కేసులో ఏడుగురు దోషులకు జీవిత ఖైదు పడింది. 1999లో సుప్రీంకోర్టు నలుగురికి మరణశిక్ష, మిగిలిన ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. 2000లో నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014లో సుప్రీం కోర్టు పేరారివాలన్‌తో సహా మిగిలిన మూడు మరణశిక్షలను తగ్గించింది.