NTV Telugu Site icon

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Sc

Sc

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం ఈ విచారణ జరిపింది.. ఇసుక అక్రమ మైనింగ్ పై కీలక ఆదేశాలు వెలువరించింది సుప్రీంకోర్టు.. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. కలెక్టర్, పోలీసులు, అధికారులు ఈ కమిటీలో ఉండాలని.. అక్రమ మైనింగ్ ఆపడానికి చర్యలు తీసుకోవాలని.. అలాగే కమిటీ రెగ్యులర్ గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని.. ప్రతి జిల్లాలో ఈ కమిటీ ఉండాలని స్పష్టం చేసింది..

Read Also: Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..

మరోవైపు.. “గ్రీవెన్స్ సెల్” ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణకు “టోల్ ఫ్రీ” నెంబర్, ఈ మెయిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా కమిటీ పని చేయాలని.. “టోల్ ఫ్రీ” నెంబర్, ఈ మెయిల్ గురించి విస్తృత పబ్లిసిటీ ఇవ్వాలని పేర్కొంది. ఆదేశాలు అమలు చేయకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది.. ఇక, అక్రమ మైనింగ్ ప్రాంతాల్లో జిల్లా కమిటీ వెంటనే తనిఖీ చేసి నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలపై అనేక విమర్శలు, ఆరోపణలు లేకపోలేదు.. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Show comments