NTV Telugu Site icon

Election Commission : ఈసీ నియామకాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Cec

Cec

Election Commission : కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న నియామక విధానాన్ని తప్పు పట్టింది. ఎలక్షన్‌ కమిషనర్ల ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఉత్తర్వులను జారీ చేసింది. భారత ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో సంస్కరణలు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

Read Also: Supreme Court : అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, ఇతర అధికారుల నియామకాల విషయం ఈమధ్య వివాదాస్పదం అయ్యింది. ఎన్నికల అధికారులు కేంద్రం కనుసన్నల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వచ్చాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అధికారులు.. కేంద్రం చెప్పినట్లు వింటున్నారని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. మరో 13 నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రానున్న తరుణంలో ఈ తీర్పు.. దేశ రాజకీయాలపై కొంత ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show comments