Supreme Court: ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఓటర్లకు ఉచిత సౌకర్యాలు పంపిణీ చేశాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను ఆ పిల్‌పై స్పందన కోరింది.
Also Read: NewsClick FIR: భారత్‌లోకి అక్రమంగా విదేశీ నిధులు.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు
ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రం, ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా నోటీసులు జారీ చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించింది. ఎన్నికల ముందు ప్రభుత్వం నగదు పంపిణీ చేయడం కంటే దారుణం మరొకటి ఉండదన్నారు. ప్రతిసారీ ఇది జరుగుతుందని, పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది. భట్టు లాల్ జైన్ దాఖలు చేసిన పిల్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌తో ట్యాగ్ చేయాలని ఆదేశించింది.