Supreme Court: ఆర్టికల్ 370పై సుప్రీం విచారణ.. ఇతర రాష్ట్రాలను కూడా విభజిస్తారా? అంటూ ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Hearing On Article 370 Removal: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆలోచనకు 2019 ఫిబ్రవరి నాటి పుల్వామా ఉగ్రదాడి కారణమైందని సొలసిటరీ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న నాటి ఘటన.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలనే ఆలోచనకు బీజం వేసిందని తెలిపారు. ఇక ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్ము కశ్మీర్‌కే పరిమితం కాలేదని, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలలో ఇవి ఉన్నాయని మరి వాటి పరిస్థితి ఏంటి వాటిని కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తారా అని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ అధికారం కేంద్రానికి ఉందా అని ధర్మాసనం అడిగింది. కేవలం సరిహద్దు కనుకే ఇలా విభజించాం అనే సమాధానం మాత్రం చెప్పకండంటూ జస్టిస్ కౌల్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై భారతప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారం ఉందని కేంద్రప్రభుత్వం ఒప్పుకున్న తరువాత ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయదని ఎలా నిర్దారిస్తారని ప్రశ్నించారు.
Also Read: Karnataka: పెళ్లి భోజనాలు చేసి ఆసుపత్రి పాలైన 150 మంది
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఇక ఈ ప్రశ్నలపై స్పందించిన తుషార్ మెమతా.. జమ్మూ కశ్మీర్ దశాబ్ధాల కాలంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయని, పైగా జమ్ము పాకిస్తాన్ తో సరిహద్దును పంచకుంటుందని తెలిపిన సొలెసిటర్ జనరల్ కేంద్రం తొందరపాటుతో జమ్మును విభజించాలనే నిర్ణయం తీసుకోలేదని, అన్ని పరిశీలించి, ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కూడా విభజిస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ అప్పుడు ప్రామాణికాలు వేరుగా ఉంటాయని సొలిసిటర్ జనరల్ బెంచ్‌కు వివరించారు. జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోరింది. దీనిపై సమావేశం ఏర్పాటు చేసి చర్చించి సెప్టెంబర్ 1వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్రం, కోర్టుకు తెలియజేసింది.
ఇక ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడే కేంద్ర హోం శాఖ మంత్రి ఓ ప్రకటన చేశారు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరకోగానే మళ్లీ జమ్ము కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొ్న్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని కేంద్రప్రభుత్వం రెండు రోజుల్లో ఇవ్వనుంది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే జమ్ము కశ్మీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా లఢఖ్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని తుషార్ మెహతా వెల్లడించారు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!