Site icon NTV Telugu

Supreme Court: ఆర్టికల్ 370పై సుప్రీం విచారణ.. ఇతర రాష్ట్రాలను కూడా విభజిస్తారా? అంటూ ప్రశ్న

Article 370

Article 370

Supreme Court Hearing On Article 370 Removal: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆలోచనకు 2019 ఫిబ్రవరి నాటి పుల్వామా ఉగ్రదాడి కారణమైందని సొలసిటరీ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.  40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న నాటి ఘటన.. జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలనే ఆలోచనకు బీజం వేసిందని తెలిపారు. ఇక ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్ము కశ్మీర్‌కే పరిమితం కాలేదని, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా రాష్ట్రాలలో ఇవి ఉన్నాయని మరి వాటి పరిస్థితి ఏంటి వాటిని కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తారా అని  దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్రాన్ని ప్రశ్నించింది. ఆ అధికారం కేంద్రానికి ఉందా అని ధర్మాసనం అడిగింది. కేవలం సరిహద్దు కనుకే ఇలా విభజించాం అనే సమాధానం మాత్రం చెప్పకండంటూ  జస్టిస్‌ కౌల్‌ అసహనం  వ్యక్తం చేశారు. దీనిపై భారతప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారం ఉందని కేంద్రప్రభుత్వం ఒప్పుకున్న తరువాత ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేయదని ఎలా నిర్దారిస్తారని ప్రశ్నించారు.

Also Read: Karnataka: పెళ్లి భోజనాలు చేసి ఆసుపత్రి పాలైన 150 మంది

ఇక ఈ ప్రశ్నలపై స్పందించిన తుషార్ మెమతా.. జమ్మూ కశ్మీర్ దశాబ్ధాల కాలంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయని, పైగా జమ్ము పాకిస్తాన్ తో సరిహద్దును పంచకుంటుందని తెలిపిన సొలెసిటర్ జనరల్ కేంద్రం తొందరపాటుతో జమ్మును విభజించాలనే నిర్ణయం తీసుకోలేదని, అన్ని పరిశీలించి, ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కూడా విభజిస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ అప్పుడు ప్రామాణికాలు వేరుగా ఉంటాయని సొలిసిటర్‌ జనరల్‌ బెంచ్‌కు వివరించారు. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోరింది. దీనిపై సమావేశం ఏర్పాటు చేసి చర్చించి సెప్టెంబర్‌ 1వ తేదీన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని కేంద్రం, కోర్టుకు తెలియజేసింది.

ఇక ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడే కేంద్ర హోం శాఖ మంత్రి ఓ ప్రకటన చేశారు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి చేరకోగానే మళ్లీ జమ్ము కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని పేర్కొ్న్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని కేంద్రప్రభుత్వం రెండు రోజుల్లో ఇవ్వనుంది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే జమ్ము కశ్మీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా లఢఖ్ మాత్రం కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని తుషార్ మెహతా వెల్లడించారు

Exit mobile version