Delhi Water Crisis: ఢిల్లీ నీటి ఎద్దడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ ( గురువారం ) కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానాకు 137 క్యూసెక్కుల నీటిని తక్షణమే ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్‌ను కోర్టు కోరింది. అది ఢిల్లీకి విడుదల చేయబడుతుంది చెప్పుకొచ్చింది. తద్వారా దాహంతో ఉన్న ఢిల్లీకి బిగ్ రిలీఫ్ దొరుకుతుందని పేర్కొనింది. దీంతో పాటు నీటిని పొదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని అత్యున్నత ధర్మాసనం చెప్పుకొచ్చింది.
Read Also: Miss You First Look: ‘మిస్ యూ’ ఫస్ట్ లుక్ విడుదల.. సరికొత్తగా సిద్దార్థ్!
ఇక, ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తులు పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌ల ద్విసభ ధర్మాసనం ముందు ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇక, సుప్రీం ధర్మాసనం.. హిమాచల్ విడుదల చేసిన నీటిని కొలవాలని ఎగువ యమునా రివర్ బోర్డును ఆదేశించింది. అలాగే, హిమాచల్‌కు ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి, ఎగువ నుంచి 127 క్యూసెక్కులను తరలించాలన్నారు. తద్వారా నీరు హత్నికుండ్ డ్యామ్‌కు చేరుకుంటుంది.. అక్కడి నుంచి వజీరాబాద్ మీదుగా ఢిల్లీకి చేరనుందని పేర్కొనింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ముందస్తు నోటీసుతో మిగులు జలాలను విడుదల చేయాలని చెప్పుకొచ్చింది. హత్నీకుండ్ నుండి వజీరాబాద్‌కు నీటి ప్రవాహాన్ని హర్యానా రాష్ట్రం ఢిల్లీకి చేరే వరకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వాసితులకు తాగునీరు అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
