Supreme Court : ఓ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న భార్యభర్తలు సుప్రీంకోర్టును వెరైటీ కోరిక కోరారు. బిడ్డను కనాలని ఉందని అందుకు ఐవీఎఫ్ చేయించుకునేందుకు పెరోల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఆ దంపతులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో దంపతులు ఈ సారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. దంపతులిద్దరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి బెంచ్ పిటిషన్‌పై విచారణ జరిపింది. అయితే, దంపతుల పెరోల్‌ను సానుభూతితో పరిశీలించాలని సుప్రీంకోర్టు అధికారులకు సూచించింది. ఈ కేసులో న్యాయపరమైన అడ్డంకులు లేకపోతే దంపతులకు పెరోల్ ఇవ్వాలని చెప్పింది.
Read Also: Mumbai Police : నిందితుడిని జైల్లో పెట్టుకుని.. 20ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు
ఈ క్రమంలో దంపతులిద్దరిని ఉదయ్‌పూర్‌లోని ఓపెన్ ఎయర్ క్యాంప్ క్వార్టర్స్‌కు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా.. అయితే, మహిళకు ఇంతకు ముందే పెళ్లి జరిగి.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. సదరు పిటిషనర్లు పెరోల్‌పై ఉన్న సమయంలో వివాహం చేసుకున్నారని, అత్యవసర కేసుల్లో మాత్రమే మనవతా కోణంలోనే పెరోల్ మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. మహిళకు ఇప్పటికే పెళ్లి జరిగి.. 23, 16 సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఇప్పటికే ఉన్నందున ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు పెరోల్‌ను ఇవ్వలేమంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే పిటిషనర్లు పెరోల్‌పై ఉన్న సమయంలోనే ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారని, వివాహం సైతం రిజిస్టర్ కాలేదన్న హైకోర్టు కోర్టు పెరోల్‌కు నిరాకరించింది.