తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు ఆరుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టుకు నలుగురు, ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా సీనియర్ న్యాయవాదులైన రేణుకా యారా, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలా దేవి, మధుసూదన రావు నియమితులయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జీలుగా అవధానం హరిహరనాధ శర్మ, డా.యడవల్లి లక్ష్మణ రావులు నియమితులయ్యారు.
Also Read: Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసు.. నేడు ఈడీ విచారణకు కేటీఆర్!
రేణుకా యారా, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలా దేవి, మధుసూదన రావులను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 11న సిఫారసు చేసింది. ఇందుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. హైదరాబాద్‌కు చెందిన రేణుక యారా ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నందికొండ నర్సింగ్ రావు ప్రస్తుతం సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేస్తున్నారు. సంగారెడ్డికి చెందిన తిరుమలా దేవి ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, విజిలెన్స్ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాజీపేటకు చెందిన మధుసూదన్ రావు ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా విధులు నిర్వహిస్తున్నారు.