Supreme Court: ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది.. సంజయ్ బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.. ఏపీ హై కోర్టు ఉత్తర్వులను కొట్టేసింది సుప్రీంకోర్టు.. గత ప్రభుత్వంలో అగ్ని మాపక శాఖలో ఎన్‌వోసీ ఆన్ లైన్ లో జారీకి సంబంధించి.. కాంటాక్ట్ విషయంలో సంజయ్ పై కేసు నమోదు అయింది.. అగ్ని.. ఎన్‌వోసీ వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ అభివృద్ధి కి 150 టాబ్ ల సరఫరా కాంటాక్ట్. సౌత్రిక టెక్నాలజిస్ కు అప్పగించారు.. పనులు జరగకపోయినా 59 లక్షల బిల్లులు చెల్లించారు.. సీఐడీ తరపున ఎస్సి ఎస్టీ చట్టం పై దళితుల గిరిజనులకు అవగాహనా సదస్సుల నిర్వహణ కాంటాక్ట్ క్రీత్వాస్ సంస్థకు అప్పగించారు.. కోటి 19 లక్షలు చెల్లించారు. సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. ఈ సంస్థ కు బిల్లులు పేరిట 2 కోట్లు దోచి పెట్టారని కేసు నమోదు అయింది.. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి రెండు నివేదికలు ఇచ్చింది. వీటి ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది.. ప్రధాన నిందితుడిగా సంజయ్ పేరు చేర్చారు. ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 5న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు లో సవాల్ చేసింది.. ఏపీ హై కోర్టు ఉత్తర్వులను కొట్టేస్తూ సుప్రీంకోర్టు సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు చేసింది..
Read Also: BJP- Communist Party Alliance: కమ్యూనిస్టులకు బీజేపీ ఆహ్వానం.. కలిసి పని చేద్దాం!
