Site icon NTV Telugu

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌.. విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

Sc

Sc

Chandrababu Quash Petition: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. అదే రోజు వాదనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.. కాగా, సీఐడీ తరపున నమోదు చేసిన కేసు కొట్టివేయాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.. తనపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టివేయాలని పేర్కొంటూ క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం విదితమే.

కాగా, సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ ఈ రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి.. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు.. 17ఏ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 17ఏ సెక్షన్‌ పరిధిలోని అంశాలను కోర్టు ముందుంచారు సాల్వే.. రఫేల్‌ కొనుగోళ్లపై యశ్వంత్‌ సిన్హా వేసిన పిటిషన్‌, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రఫేల్‌ కేసులో జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు సార్వే.

అనంతరం సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు కొనసాగాయి.. 2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్‌ ముందు ఉంచుతున్నాం అన్నారు.. విచారణ ముగిసిన తర్వాత పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్‌ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచామని తెలిపారు.. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదని స్పష్టం చేశారు.. తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాతే 2021లో కేసు నమోదు చేశారని వాదించారు.. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17 ఏ వర్తించదు అని అని ముకుల్‌ రోహత్గీ తన వాదనలను సుప్రీంకోర్టులో వినిపించారు.. అయితే, ఇరు వర్గాల వాదనలు విన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. ఇప్పటికే హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు శుక్రవారం ఎలాంటి విచారణ సాగుతుంది అనేది ఉత్కంఠగా మారింది.

Exit mobile version