Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ అడ్వెంచర్ డ్రామాలో నటిస్తున్నారు. ‘వారణాసి’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం మహేష్‌ను గ్లోబల్ ఐకాన్‌గా మార్చడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ తదుపరి లైనప్ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రాజమౌళి తర్వాత మహేష్ బాబు సుదీర్ఘ గ్యాప్ తీసుకోకుండా, బ్యాక్-టు-బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఊహించని బజ్ వినిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, రాజమౌళి సినిమా పూర్తయిన వెంటనే మహేష్ తన తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చేయనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు ముగిశాయని, అడ్వాన్స్ కూడా చేతులు మారిందని టాక్ వినిపిస్తోంది. ఇది భారీ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందని సమాచారం. దీంతో పాటుగా సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో మహేష్ సినిమాలు ఉండే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి.
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
- Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
అలాగే తన సొంత బ్యానర్ జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ పైన కూడా ఒక విభిన్నమైన కథను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారట. జక్కన్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను అత్యంత శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న పాన్ వరల్డ్ లెవల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ మహేష్ కొత్త లుక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!