Uttarpradesh: జువెనైల్ హోమ్‌లో అమానుషం.. పిల్లలను చెప్పుతో కొట్టిన మహిళ అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Superintendent Brutally Trashes Girl In UP Juvenile Home: బాల ఖైదీలుగా హోమ్‌లోకి వచ్చిన పిల్లలకు మంచి బుద్దులు, సత్ప్రవర్దన అలవాటు చేయాల్సిన బాధ్యత జువెనైల్ హోమ్ అధికారులది. తెలిసి, తెలియక చేసిన నేరాలకు వారు శిక్ష అనుభవిస్తూ ఉంటారు. అయితే వారిని తీర్చిదిద్దాల్సిన అక్కడి సిబ్బంది కొన్నిసార్లు వారితో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చిన్నపిల్లలనే కనికరం లేకుండా కర్కశంగా కొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళా అధికారి తన బాధ్యతలు మరిచి చిన్నపిల్లలను చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ఆగ్రాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Also Read: Adtiya L1 Mission: భూమి చుట్టూ నాలుగు రౌండ్లు వేసిన ఆదిత్య ఎల్-1 మిషన్.. సూర్యుని వైపు మరో అడుగు
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
ఆగ్రాలోని జువైనల్ హోంలో సీసీ టీవీలో కొన్ని దృశ్యాలు రికార్డయ్యారు. ఇవి సోమవారం నుంచి సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడంతో అక్కడి చిన్నారుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. ఈ వీడియోలుఅందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి. సోమవారం, మంగళవారం రెండు వీడియోలు విడుదల కాగా అవి విస్మయానికి గురిచేస్తున్నాయి. సోమవారం విడుదల చేసిన వీడియోలో ఒక గదిలో మంచంపై పడుకొని ఆరుగురు బాలికలు ఉన్నారు. ఇంతలో సడెన్ గా అక్కడికి వచ్చిన జువైనల్ హోం సూపరింటెండెంట్ పూనమ్ పాల్ కనికరం లేకుండా ఓ బాలికను చెప్పుతో ఎలా పడితే అలా కొట్టింది. అంతేకాకుండా ఇతర బాలికలను కూడా ఇష్టం వచ్చినట్లు తిట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఇదంతా చూస్తున్న తోటి ఉద్యోగులు కూడా ఆమెను ఆపలేదు. ఇంకా మంగళవారం విడుదలైన వీడియోలో ఏడేళ్లు వయసు ఉన్న బాలికను మంచానికి కట్టేశారు. ఆమె విడుపించుకోవడానికి ప్రయత్నించిన వీలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయంపై విచారణ జరిపిన అధికారులు పాల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై కేసు నమోదు చేశారు.
In #Agra‘s govt run children shelterhome (Pachkuiyaan), Poonam Lal, the center superintendent was caught slapping a girl with slippers. Earlier she was booked for abetment to suicide in #Prayagraj district in 2021 after a 15-yr-old girl allegedly killed her self in shelter home pic.twitter.com/JE5V56jR7l
— Arvind Chauhan 💮🛡️ (@Arv_Ind_Chauhan) September 12, 2023
తాజావార్తలు
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!