NTV Telugu Site icon

Mahesh Babu: బాధ నుంచి బయట పడడానికి ఎన్టీఆర్ బాటలో మహేశ్..

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లడం యావత్ తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ సామాన్య ప్రజలని కూడా బాధ పెట్టింది. మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఎన్నో ప్రయోగాలు చేసిన కృష్ణ చనిపోవడం మహేష్ బాబుకి తీరని లోటు. అమ్మ చనిపోయిన నెలన్నరకే తండ్రి కూడా చనిపోవడం అనేది ఎవరికీ రాకూడని కష్టం. ఇలాంటి కష్ట సమయంలో మహేశ్ బాబు తన బాధ మరిచిపోయి, మళ్ళీ రెగ్యులర్ లైఫ్‌లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. తండ్రి మరణించిన బాధ నుంచి కోలుకోవాలి అంటే తాను బిజీగా ఉండాలి అని గుర్తించిన మహేశ్ బాబు, త్రివిక్రమ్‌తో చేస్తున్న SSMB 28 సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టడానికి సిద్దమవుతున్నాడు.

B. Hari Kumar: కృష్ణ మృతి మరువకముందే స్టార్ కమెడియన్ మృతి

మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో సినిమాగా SSMB 28 సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లింది. అనుకున్న టైం కన్నా చాలా డిలేతో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ, వారం షెడ్యూల్‌ని కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‌ని డిసెంబర్ 8 నుంచి స్టార్ట్ చేయండని మహేశ్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. మహేశ్ బాబునే స్వయంగా త్రివిక్రమ్ కి కాల్ చేసి షూటింగ్ పెట్టమని చెప్పాడట. నవంబర్ నెల చివరికి తండ్రి పెద్ద కర్మకి సంబంధించిన పనులు పూర్తి చేసేసి, ఒక వారం రెస్ట్ తీసుకోని మహేశ్ SSMB 28 సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేస్తాడు. అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోతే… ఇలానే కార్యక్రమాలని పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్, డిలే చేయకుండా అరవింద సమేత షూటింగ్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు మహేష్ బాబు షూటింగ్ సిద్ధమవుతుంటే, త్రివిక్రమ్‌కి అరవింద సమేత షూటింగ్ సమయంలో ఉన్న వాతావరణమే గుర్తొచ్చే ఛాన్స్ ఉంది. సెట్స్‌లో సరదాగా ఉండే మహేశ్ బాబుని సైలెంట్ మోడ్‌లో, సాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Show comments