Super Splendor Canvas Black Edition Released
ప్రముఖ టూవీలర్ దిగ్గజం సంస్థ హీరో కంపెనీ కొత్తగా స్ల్పెండర్ మోడల్‌లో ఒక సూపర్‌బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెండు వేరియంట్లలోలభించనున్న వీటి ధరలను ప్రకటించింది హీరో కంపెనీ. బేస్ డ్రమ్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 77,430 (ఎక్స్-షోరూమ్)గానూ, డిస్క్ సెల్ఫ్-కాస్ట్ వేరియంట్ ధరను రూ. 81,330 (ఎక్స్-షోరూమ్)గా ఉంచింది కంపెనీ. ఇంజన్ ప్రీమియం బోల్డ్ డిజైన్ , అప్‌డేటెడ్ టెక్నాలజీతో, కొత్త హీరో సూపర్ స్ప్లెండర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. లీటరుకు 60-68 కిలీమీటర్ల సెగ్మెంట్‌లో అత్యుత్తమ మైలేజీతో 13 శాతం వరకు మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని హీరో వెల్లడించింది. ఈ బైక్‌లోని 125cc, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 RPM వద్ద 10.7 HP , 6000 RPM వద్ద 10.6 Nm శక్తిని అందిస్తుంది.
డిస్క్ బ్రేక్, కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో హీరో సూపర్ కాన్వాస్ బ్లాక్ ఎడిషన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. డీజీ-అనలాగ్ క్లస్టర్, ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ ఛార్జర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఉన్నాయి. 5 సంవత్సరాల వారంటీతో పాటు, గ్రాఫిక్స్‌తో కస్టమర్‌లు కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పించింది. అధునాతన ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజన్‌తో పాటు, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, సరికొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని అందించింది హీరో కంపెనీ.