ఆకాశంలో ఈరోజు అద్భుతమైన దృశ్యం ఆవిష్కరణ కానుంది. గగనతలంలో ఈరోజు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. 2023 లో ముఖ్యమైన నాలుగు సూపర్ మూన్ లు ఆవిష్కృతం అవుతుండగా, మొదటిది జూలై 3 వ తేదీన అంటే సంభంవించింది. అయితే.. ఈ నెలలో రెండు సూపర్ మూన్‌లు ఆకాశంలో కనివిందు చేయనున్నాయి. నేడు మొదటి సూపర్ మూన్ దర్శనమివ్వనుండగా, ఇదే నెల 30న బ్లూ మూన్ కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తల వెల్లడించారు. ఇవాళ అర్థరాత్రి 12.01 గంటలకు పౌర్ణమి కంటే కొంచెం పెద్దగా, ప్రకాశవంతంగా చంద్రడు కనిపించనున్నాడు. మళ్లీ 30న రెండో పౌర్ణమి సందర్భంగా కనిపించనున్న బ్లూ బూన్ కనిపించనుంది.
Also Read : WI vs IND 3rd ODI: వెస్టిండీస్‌పై భారీ విజయం.. ప్రపంచంలోనే ఏకైక జట్టుగా భారత్!
ఇలాంటి ఘటన 2037 వరకు మళ్లీ జరగదని శాస్ట్రవేత్తల వెల్లడించారు. సాధారణ రోజుల్లో కంటే భూమికి దగ్గరగా చంద్రుడు రావడం వల్లే.. జాబిలి పెద్ద ఆకారంలో మరింత కాంతివంతంగా కనిపించింది. ఈ భౌగౌళిక దృగ్విషయాన్ని ఆయా దేశాలు, ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు లేదా మూడు సూపర్‌మూన్‌లు ఏర్పడుతుంటాయి. ఆగస్టు 30వ తేదీన ఏర్పడబోయే సూపర్‌మూన్ మాత్రం చాలా అరుదు. అలాంటి సందర్భాన్ని మళ్లీ 2032 వరకు మనం చూడలేకపోవచ్చు. ఫుల్ మూన్ సమయంలో, జాబిల్లి కక్ష్య భూమికి దగ్గరగా ఉన్నప్పుడు సూపర్‌మూన్ ఆవిష్కృతమౌతుంది.
Also Read : Tamilisai : నేడు వరంగల్‌లో గవర్నర్ తమిళిసై పర్యటన.
