కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది… ఐసీయూలో వెంటిలేటర్ చికిత్ప జరుగుతోంది. సూపర్ స్టార్ కృష్ణకు కార్డియాక్ అరెస్ట్.. 24 గంటల తర్వాత ఆరోగ్యంపై ప్రకటన చేస్తాం.. అర్థరాత్రి కోడలు నమ్రత కృష్ణను ఆస్పత్రికి తీసుకువచ్చారు.. క్రిటికల్ స్టేజ్ లో వున్నారు. మా ఆస్పత్రి అంటే నమ్మకం… ఫ్యామిలీ ఆస్పత్రి మాది అన్నారు కాంటినెంటల్ ఎండీ గురు.ఎన్.రెడ్డి. అత్యంత విషమంగా కృష్ణ ఆరోగ్య పరిస్థితిలో వున్నారు. గంట గంటకు ఏమవుతుందో చెప్పలేము. శరీరం సహకరించే దాన్ని బట్టి వైద్యం. ఆయన బయటపడాలని కోరుకుందాం. ఆసుపత్రికి వచ్చినపుడు స్పృహలో లేరన్నారు గురు.ఎన్.రెడ్డి.
9 ఏళ్ళ నుంచి కాంటినెంటల్ ఆస్పత్రిలోనే వైద్యం అందిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆయన ఆస్పత్రికి ఏం రాలేదు.