Super Hit Pairs: సౌత్ ఇండస్ట్రీలో హిట్ పెయిర్స్ మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన హీరోయిన్లతో మరోసారి స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ జోడీల లైన్ అప్ ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్‌మెంట్ క్రియేట్ చేస్తోంది. ఈ లిస్ట్ లో ముందుగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జున గురించి చెప్పుకుంటే.. ఆయనతో టబు జోడీగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా 1996లో కృష్ణవంశి దర్శకత్వంలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఈ జంట మరోసారి కలిసి కనిపించలేదు. అయితే ఇప్పుడు అంటే దాదాపు 25 ఏళ్ల తర్వాత నాగ్ 100వ సినిమా కోసం మళ్లీ ఈ జోడీ కలిసి నటిస్తోందని బజ్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య, ఖిల్ కూడా గెస్ట్ అపియరెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం.
Akkineni Nagarjuna : మొన్న రజనీకాంత్.. నిన్న ధనుష్.. నేడు ప్రదీప్ రంగనాథ్..
ఇక ఈ లిస్ట్ లో తర్వాత వెంకటేష్, మీనా జంట గురించి చెప్పుకోవాలి. ఈ జంట టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన జోడీలలో ఒకటిగా చెప్పవచ్చు. చంటి మొదలు దృశ్యం 2 వరకు వీరి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ జంట దృశ్యం 3లో కూడా మళ్లీ కనిపించబోతోంది. ఇప్పటికే మలయాళ వర్షన్ షూటింగ్ పూర్తి కాగా, తెలుగు వర్షన్‌ను దర్శకుడు జీతు జోసెఫ్ త్వరలో ప్రారంభించనున్నారని సమాచారం. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నరసింహాలో నీలాంబరి, నరసింహాగా గుర్తుండిపోయిన ఈ జంటను దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మళ్లీ కలిపాడు. జైలర్ సినిమాలో భార్యాభర్తలుగా కనిపించిన వీరు, రాబోయే జైలర్ 2లో కూడా తమ స్క్రీన్ కెమిస్ట్రీని కొనసాగించబోతున్నట్లు టాక్.
Karwa Chauth Shock: కర్వా చౌత్ రాత్రి ఊహించని ఘటన.. భర్తల ఇళ్లలే దోచేసిన 12 మంది నూతన వధువులు!
ఇక ఈ లిస్ట్ లో జూనియర్ హీరోల విషయానికి వస్తే.. ధనుష్, సాయి పల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని టాక్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోయే కొత్త చిత్రంలో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించారట. ఇది నిజమైతే మారి 2 తర్వాత ఏడేళ్లకు ఈ జంట మళ్లీ కలిసి పని చేయనుంది. అలాగే మరో తమిళ నటుడు శివకార్తికేయన్ విషయానికి వస్తే… ఆయన హీరోయిన్లను రిపీట్ చేసే హీరోగా పేరుగాంచాడు. కీర్తి సురేష్, ప్రియాంక అరుల్ మోహన్‌లతో రెండుసార్లు జోడీ కట్టిన శివ.. ఇప్పుడు శ్రీలీలతో మరోసారి జోడీ కడుతున్నాడట. ప్రస్తుతం ఈ జంట పరాశక్తి సినిమాలో నటిస్తుండగా, డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కబోయే తన కొత్త సినిమాకూ శ్రీలీలనే సిఫారసు చేశాడని టాక్.
