NTV Telugu Site icon

SRH vs PBKS: పంజాబ్ పై సన్రైజర్స్ విజయం.. రెండో స్థానానికి హైదరాబాద్

Srh Won

Srh Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 214 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ షేక్ ఆడించాడు. 28 బంతుల్లో 66 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత.. క్లాసెన్ (42) పరుగులు చేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (37), రాహుల్ త్రిపాఠి (33) పరుగులతో రాణించారు. షాబాజ్ అహ్మద్ (3), అబ్దుల్ సమద్ (11*), సన్వీర్ సింగ్ (6) పరుగులు చేసి విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో 2 వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత.. హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ తలో వికెట్ తీశారు.

Read Also: Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు.. అవేవో చూడండి

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్లో అత్యధికంగా ప్రభ్సిమ్రాన్ సింగ్ (71) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 4 సిక్సులు, 7 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత అథ్వారా థైడే (46), రిలీ రోసో (49) పరుగులతో రాణించారు. ఆ తర్వాత శశాంక్ సింగ్ (2), జితేష్ శర్మ (32*), అశుతోష్ శర్మ (2), శివం సింగ్ (2*) పరుగులు చేశారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో నటరాజన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత కమిన్స్, విజయ్ కాంత్ వియస్కాంత్ తలో వికెట్ సాధించారు. కాగా.. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.

Read Also: Devara Fear Song : దేవర సాంగ్ వచ్చేసింది.. అనిరుథ్ అరిపించాడు మావా!

Show comments