Site icon NTV Telugu

DC vs SRH: ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్.. సన్‌రైజర్స్ నెగ్గేనా?

Dc Vs Srh

Dc Vs Srh

DC vs SRH: ఐపీఎల్‌-16వ సీజన్‌లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కంటే హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్‌, బౌలింగ్‌లోనూ చాలా బలంగా ఉంది. ఇదిలా ఉండగా ఢిల్లీ తన చివరి మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంగా ఉంది. విజయపరంపరను అలాగే కొనసాగించాలని హైదరాబాద్‌తో పోరుకు రెడీ అయింది. ఇక ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పిచ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Read Also: Traffic: ప్రపంచంలో అత్యంత చెత్త ట్రాఫిక్ ఉన్న నగరాలు

ఈ తరుణంలో సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ జట్టు పరీక్షకు సిద్ధమైంది. వరుసగా రెండు ఓటములు, తర్వాత రెండు విజయాలు, మళ్లీ ఓటములతో ఉన్నా హైదరాబాద్‌ జట్టు.. వరుస ఓటములకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఓపెనర్ హ్యారీ బ్రూక్ కేకేఆర్‌పై సెంచరీ బాదినా.. దానికి ముందు, తర్వాత విఫలమయ్యాడు. ఇతర బ్యాట్స్‌మెన్‌ కూడా అంచనాలకు తగ్గట్లుగా ఆడడం లేదు. బ్యాటింగ్ కుదురుగా లేకపోయినా, బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. పేసర్లు భువనేశ్వర్‌, జాన్సెన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.. స్పిన్నర్లు మయాంక్‌ మార్కండే, వాషింగ్టన్‌ సుందర్‌, మయాంక్‌ దాగర్‌ వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఢిల్లీ బ్యాటింగ్‌లో కెప్టెన్ వార్నరే దిక్కు. ఢిల్లీలోని ఇతర బ్యాట్స్‌మెన్‌ ఇప్పటివరకు కుదురుకోలేదు. బౌలర్లు బాగా రాణిస్తున్నారు. మరి ఆ జట్టును సన్‌రైజర్స్‌ ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సిందే.

Exit mobile version