Site icon NTV Telugu

IPL 2024: మేము పక్కా ఇంకో రేంజ్‌ బ్రో.. అదరగొడుతున్న ఎస్ఆర్హెచ్ కొత్త సాంగ్

Srh

Srh

IPL 2024: ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్ కొత్త పాటను ఇవాళ రిలీజ్ చేసింది. క్యాచీ ట్యూన్‌ కలిగిన ఈ పాట “సన్‌రైజర్స్‌ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్‌ బ్రో..” అంటూ స్టార్ట్ అవుతుంది.. ఈ పాటలో సన్‌రైజర్స్‌ కొత్త సారథి పాట్‌ కమిన్స్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ట్రవిస్‌ హెడ్‌, టీమిండియా ప్లేయర్లు భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మయాంక్‌ అగర్వాల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ తదితర ఆటగాళ్లు కొత్త జెర్సీలు ధరించి బీట్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేశారు. సన్‌రైజర్స్‌ టీమ్ అభిమానుల్లో జోష్‌ నింపుతున్న ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

Read Also: PM Modi: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి ప్రధాని నరేంద్రమోడీ ఫోన్..

కాగా, ఐపీఎల్‌ 17వ ఎడిషన్‌ ఎల్లుండి (మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగే సీజన్‌ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్ తలపడుతుంది. ఇక, కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్‌ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న కేకేఆర్‌తో ఆడబోతుంది.

Exit mobile version