Site icon NTV Telugu

Sunny Deol: స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో..

Sunny Deol

Sunny Deol

Sunny Deol: విజయ దివస్‌ సందర్భంగా బాలీవుడ్‌లో ఓ భావోద్వేగపూరిత ఘట్టం చోటుచేసుకుంది. 1997లో సూపర్‌ హిట్‌ అయిన ‘బార్డర్‌’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘బార్డర్‌ 2’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఈ రోజు జరిగింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సన్నీ డియోల్‌ స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి, బాలీవుడ్‌ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత మొదటిసారి పబ్లిక్‌లో కనిపించిన ఈ స్టార్ హీరో.. స్టేజ్‌పై మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

READ ALSO: IPL 2026 Auction: ముగిసిన ఐపీఎల్ 2026 వేలం.. అత్యధిక ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ వీరే!

89 ఏళ్ల వయసులో నవంబర్‌ 24, 2025న బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఇదే సమయంలో విజయ దివస్‌ (డిసెంబర్‌ 16)న ‘బార్డర్‌ 2’ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ మేజర్‌ కుల్‌దీప్‌ సింగ్‌ పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వరుణ్‌ ధావన్‌, దిల్‌జిత్‌ దోసాంజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈవెంట్‌లో పాల్గొన్న సన్నీ డియోల్ సినిమాకు సంబంధించిన డైలాగ్ చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. 1997లో జె.పి. దత్తా డైరెక్షన్‌లో వచ్చిన ‘బార్డర్‌’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌ యాక్షన్‌ హీరోగా మరింత పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం ‘బార్డర్‌ 2’ను అనిరుధ్‌ ఐయర్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు.

READ ALSO: Off The Record: ప్రభాకర్ రావుది నేర విచారణ లేక రాజకీయ వేధింపా .. ?

Exit mobile version