NTV Telugu Site icon

Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే?

Sunita Williams

Sunita Williams

Sunita Williams Space Mission: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే, కొత్త లాంచ్ తేదీ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమె బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమైంది. 58 సంవత్సరాల వయస్సులో సునీత విలియమ్స్ మంగళవారం మూడవసారి అంతరిక్షంలోకి వెళ్లడానికి సిద్ధం అయ్యారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించాల్సిన బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో ఆమె ప్రయాణించాల్సి ఉంది. స్టార్‌లైనర్ స్పేస్ షిప్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళుతుంది. స్టార్‌లైనర్‌ స్పేస్‌షిప్‌ను మంగళవారం ఉదయం భారత కాలమానం ప్రకారం 8.04 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్‌ నుంచి బయలుదేరాల్సి ఉండగా.. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ రాకెట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మిషన్‌ను నిలిపివేసినట్లు సమాచారం.

Read Also: PM Modi: రేపు వేములవాడలో మోడీ పర్యటన.. 1200 మందితో భారీ భద్రత..

తొలి మానవసహిత స్టార్‌లైనర్‌ మిషన్‌ను బోయింగ్‌ కంపెనీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మిషన్‌కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. ఫలితంగా రాకెట్‌ లాంచ్ చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అంతా సిద్ధం అనుకుంటున్న తరుణంలో మూడో సారి ఈ మిషన్‌ వాయిదా పడింది. స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో అనేక అవాంతరాల కారణంగా మిషన్ చాలా సంవత్సరాలు ఆలస్యం చేయబడింది. ఇది విజయవంతమైతే, ఎలోన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళిన రెండవ ప్రైవేట్ కంపెనీ అవుతుంది. సునీతా విలియమ్స్ బీబీసీతో మాట్లాడుతూ.. మేమంతా అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములైనందుకు మా కుటుంబం, స్నేహితులు సంతోషంగా, గర్వంగా ఉన్నారని పేర్కొన్నారు.

ఆమె గతంలో 2006, 2012లో అంతరిక్షంలోకి వెళ్లి మొత్తం 322 రోజులు గడిపారు. ఆమె 50 గంటల 40 నిమిషాల ఏడు అంతరిక్ష నడకలతో మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించింది. ఆమె అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు గణేశుడి విగ్రహం, ఉపనిషత్తులతో పాటు సమోసాలను తీసుకువెళ్లడం విశేషం. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ దానిని బద్దలు కొట్టింది. సునీత అమెరికాలోని ఓహియోలోని యూక్లిడ్‌లో భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, బోనీ పాండ్యా దంపతులకు జన్మించింది. దీపక్ పాండ్యా గుజరాత్‌లోని మెహసానా నుంచి అమెరికాకు వెళ్లారు. సునీత 1987లో యూఎస్ నేవీలో నియమితులయ్యారు. దీని తర్వాత, అతను 1988లో వ్యోమగామిగా నాసాలో ఎంపికయ్యారు.