పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచార జోరును పెంచారు. ఇంటింటికి తిరుగుతూ.. ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. అవ్వా తాత, అన్న చెల్లి అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో బిజీ బిజీగా సాగుతున్నారు. ప్రచారంలో భాగంగా.. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఏవీ ఇన్ఫోప్రైడ్ లోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏవీ ఇన్ఫోప్రైడ్ లోగ అపార్ట్మెంట్ అసోసియేషన్ వారితో నిర్వహించిన సమావేశంలోనూ సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Harish Rao: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నేతల మెడలు వంచుతాం
ఇదిలా ఉంటే.. మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పూజ కార్యక్రమాలలో పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ హనుమంతుడి దీవెనలు తన పై ఎల్లప్పుడూ ఉండాలని, వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యురాలిగా గెలుపొందాలని.. మల్కాజ్గిరిని అభివృద్ధి పరిచి, ప్రజల మన్నన పొందాలి అని హనుమంతుడిని కోరుకున్నట్లు సునీత మహేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం ప్రచార కార్యక్రమం చేపట్టారు. ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. మల్కాజిగిరి పార్లమెంట్‌ను శక్తిమంతంగా తీర్చిదిద్దుతానని ఆమె తెలిపారు.