భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి 19 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే, క్రీడా ప్రపంచంలో చాలా మంది భారత ఫుట్బాల్ లెజెండ్ ను గౌరవించడానికి, అభినదించడానికి ముందుకు వచ్చాయి. ఛెత్రి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో 10 నిమిషాల వీడియోతో పదవీ విరమణ ప్రకటించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి తనను మొదటిసారి పిలిచిన సమయంలో తన కెరీర్ సమయం ఇక ఫుట్బాల్ కు కేటాయించాలనే తన నిర్ణయాన్ని గుర్తు చేసుకున్నాడు.
Read Also: Ghost Rider: ఒక్కసారిగా బైక్ డ్రైవ్ చేస్తున్న సమయంలో చెలరేగిన మంటలు.. చివరకు..
భారత ఫుట్బాల్ లెజెండ్, భారత ఫుట్బాల్ ప్రమాణాలను పునర్నిర్వచించిన ఆటగాడుగా సునీల్ ఛెత్రి పేరు పొందాడు. తన దేశానికి మాత్రమే కాకుండా అంతర్జాతీయ సర్క్యూట్లో కూడా ప్రేరణగా నిలిచాడు, జూన్ 6 న కువైట్ తో జరిగబోయే మ్యాచ్ లో చివరిసారిగా జాతీయ జెర్సీని ధరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్బంగా భారత క్రికెట్ లెజెండ్, ఛెత్రి స్నేహితుడు విరాట్ కోహ్లీ కూడా ఫుట్బాల్ క్రీడాకారుడి ఇన్స్టాగ్రామ్ వీడియోలో తన “సోదరుడు” పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేశారు. అతను, “నా సోదరుడు, గర్వంగా” అన్నాడు.
ఛెత్రి రిటైర్మెంట్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా శుభాకాంక్షలు వ్యక్తం చేసింది. 39 ఏళ్ల ఛెత్రీని ఫుట్బాల్ కు మాత్రమే కాకుండా మొత్తం క్రీడలకు ఐకాన్ గా ప్రశంసించింది. అలాగే భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సాధు కూడా సోషల్ మీడియాలో ఈ ప్రకటనపై స్పందిస్తూ., ఛెత్రి మనస్సును మార్చగలనని తాను కోరుకుంటున్నానని, అయితే అతను ఎందుకు ఇలా చేశాడో అర్థం చేసుకున్నాడని, జాతీయ జట్టుతో అతని అద్భుతమైన కెరీర్ ను ఆస్వాదించాలని ప్రజలను కోరారు. “ఇది జరగాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. మీ మనసు మార్చుకోవడానికి నేను ఏదైనా చేయగలనని కోరుకుంటున్నాను. కానీ ఇది ఎందుకు జరుగుతుందో కూడా నాకు అర్థం అవుతోంది భాయ్. దేశం మొత్తం మీ అంతర్జాతీయ కెరీర్ ను జూన్ 6న మీకు అర్హమైన విధంగా జరుపుకోవాలి. నా కెప్టెన్ అని ఛెత్రి పోస్ట్ పై గుర్ప్రీత్ కామెంట్ చేశారు.
భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఛెత్రికి హ్యాపీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలుపుతూ, “మీరు ఎంతో శ్రమించారు. ఓ అద్భుతమైన కెరీర్ కు అభినందనలు., హ్యాపీ రిటైర్మెంట్, లెజెండ్ ” అని ట్వీట్ చేశారు.