NTV Telugu Site icon

Sunil Bhansal: నేడు హైదరాబాద్ కు సునీల్ భన్సల్.. పార్టీ నేతలతో కీలక భేటీ

Sunil Bansal

Sunil Bansal

బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ భన్సల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయన సమీక్షించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమావేశం నిర్వహిస్తుంది.

Read Also: Odisha Train Accident: రాంగ్‌ సిగ్నలింగ్‌ వల్లనే ఒడిశా రైలు ప్రమాదం.. సేఫ్టీ కమిషన్‌ నివేదికలో వెల్లడి

అయితే, ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రూపొందింస్తుంది. అయితే ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీ నేతల మధ్య గ్యాప్ ను బట్టబయలు చేస్తున్నాయి. బీజేపీలో నేతల మధ్య సయోధ్య లేదనే వాదనలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ పరిణామాలను చూస్తే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు అర్ధమౌతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Chicken Quality Test: మీరు తినే చికెన్ తాజాదేనా.. ఈ చిట్కాలతో టెస్ట్ చేయండి?

తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అధిష్టానం భావిస్తుంది. ఈ తరుణంలో సునీల్ భన్సల్ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా మార్పులు చేర్పులు చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారం సాగుతున్న తరుణంలో సునీల్ భన్సల్ హైదరాబాద్ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Show comments