NTV Telugu Site icon

Sunil Bansal : అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలకు దిశా నిర్దేశం

Sunil Bansal

Sunil Bansal

కొత్తగా నియమించిన అసెంబ్లీ ఇంఛార్జీలతో బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ భేటీ అయ్యారు. అయితే.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలు చేయాల్సిన పనులపై సునీల్ బన్సల్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సునల్‌ బన్సల్‌ మాట్లాడుతూ.. బూత్ కమిటీలు వేయాలని, నెలలో నాలుగు రోజులు తమకు కేటాయించిన అసెంబ్లీలో పర్యటించాలన్నారు. శక్తి కేంద్రాలకు ప్రముఖులతో పాటు… ఆ శక్తి కేంద్రంతో సంబంధం లేని వారిని ఇంఛార్జీలుగా నియమించాలన్నారు.

 

అసెంబ్లీ ఇంఛార్జీలు ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న బన్సల్ వ్యాఖ్యానించారు. అయితే.. బన్సల్ మాటలతో ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్న నేతలు ఇబ్బంది పడ్డారు. అయితే.. కలగ చేసుకున్న బండి సంజయ్.. 6 నెలలు ఇంఛార్జీలుగా పని చేయండి… అన్ని పనులు పూర్తి చేయండి… ఆ తర్వాత మిమ్మల్ని ఇంఛార్జీలుగా తప్పిస్తమని బండి సంజయ్ వెల్లడించారు. దీంతో.. ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు.