Sunil : టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి అలరించిన సునీల్ హీరోగా కూడా అలరించే ప్రయత్నం చేసాడు.హీరోగా సునీల్ కు అంతగా కలిసి రాకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.అయితే ఈసారి కమెడియన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా,విలన్ గా అలరిస్తున్నాడు.సునీల్ విలన్ గా నటించిన పుష్ప సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మంగళం శీను పాత్రలో సునీల్ అద్భుతంగా నటించి మెప్పించాడు.
పుష్ప సినిమాతో సునీల్ పాన్ ఇండియా రేంజ్ లో బాగా పాపులర్ అయ్యారు.సునీల్ కు తెలుగుతో పాటు ,తమిళ్, మలయాళం సినిమాలలో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి.ఇప్పటికే తమిళ్ లో సునీల్ జైలర్, మహావీరన్,మార్క్ ఆంటోనీ వంటి సినిమాలలో నటించి మెప్పించాడు.తాజాగా సునీల్ మాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. మమ్ముట్టి లేటెస్ట్ మూవీ టర్బోలో సునీల్ విలన్‌గా నటిస్తున్నాడు.తాజాగా ఈ మూవీలో సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ శనివారం రివీల్ చేశారు.ఈ పోస్టర్‌లో సీరియస్ లుక్‌లో సునీల్ కనిపిస్తోన్నాడు. టర్బోలో సునీల్ ఆటో బిల్లా అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో సునీల్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం
టర్బో మూవీ మే 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.