Site icon NTV Telugu

Sundeep Kishan: తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం ఆనందదాయకం..!

Siima 2025

Siima 2025

Sundeep Kishan: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అవార్డ్స్ వేడుక దుబాయ్‌ లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ) దర్శకుడు ప్రశాంత్ వర్మ, విజువల్ ఎఫెక్ట్స్ వెంకట్ (హనుమాన్)లని సైమా ఘనంగా సత్కరించింది.

Pooja Pal: యూపీ సీఎం యోగిని పొగిడితే, ఎమ్మెల్యేను ఏం చేశారో తెలుసా?

ఇక ఈ కార్యక్రమంలో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. విష్ణుకి, బృందాకి, సైమాకి థాంక్యూ సో మచ్.. విష్ణు ముందే చెప్పారు, ఈ సినిమాకి నేషనల్ అవార్డు వస్తుందని అన్నారు. ఈ సినిమాపై అంత నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఇది తొలి సత్కారం. అందరూ నేషనల్ విన్నర్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా విష్ణుకి, బృందాకి, సైమాకి ధన్యవాదాలు తెలిపారు. అవార్డు వచ్చిన వారికే కాదు, సినిమా కోసం పని చేసిన అందరికీ అభినందనలు తెలుపుతున్నానన్నారు. సైమా టాలెంట్ ని సెలబ్రేట్ చేసుకునే చాలా గొప్ప వేదిక. ఎన్నో గొప్ప సినిమాలు రావడానికి కారణం అవుతున్నందుకు ఈవెంట్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు కంగ్రాజులేషన్స్ అంటూ మాట్లాడారు.

MLC Kavitha: రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌కు కవిత.. ఎందుకో తెలుసా..?

ఇక డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత తొలి గుర్తింపు సైమా ఇచ్చిందే. విష్ణు గారికి బృందా గారికి థాంక్యూ. నా కెరీర్ లో పది అవార్డులు తీసుకుంటే అందులో ఎనిమిది అరవింద్ గారి చేతుల మీద తీసుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ ఆయన మాట్లాడారు. ఇక హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సైమా అనేది మన సౌత్ ఇండియన్ సినిమాలకి నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చి పెట్టే అవార్డు వేడుక. నాకు సౌత్ ఇండియాలో ఉన్న దాదాపు 80% కోలాబరేషన్స్ సైమా వేడుక ద్వారానే వచ్చాయి. సైమా ప్రతి ఏడాది గొప్పగా ముందుకు వెళుతుంది. మన దేశంలో అవార్డు బ్రాండ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అలా అందరికీ తెలిసిన ప్రెస్టీజియస్ అవార్డ్స్ లో సైమా ముందుంటుంది అది మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం మనందరికీ ఆనందదాయకం. వేడుకలో పాలుపంచుకోవడం గర్వంగా భావిస్తున్నాను బృందా గారికి విష్ణుకి కంగ్రాజులేషన్స్ వేడుకల కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు.

Exit mobile version