Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా ఆ సమయంలో భారీ వసూళ్లను అందుకుంటాయి. దీంతో మేకర్స్.. పండుగల సీజన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. చిన్న హీరో నుంచి పెద్ద హీరోల దాకా సంక్రాంతికే తమ చిత్రాలను రిలీజ్ చేయాలని భావిస్తుంటారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు నిలుస్తున్నాయో ఇంకా ఫిగర్ ఫిక్స్ కాలేదు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో సంక్రాంతి రావాలని భావించారు. కానీ వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అదే తేదీన స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల కానుంది. సీనియర్ బాలకృష్ణ NBK 109 సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మాత్రం సంక్రాంతి బరిలో నిలిచేట్లు లేదు. వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
Read Also:Korean conflict: సౌత్ కొరియా అధ్యక్షుడి కార్యాలయ పరిసరాల్లో చెత్త బెలూన్.. కిమ్పై ఆగ్రహం
నాగచైతన్య.. తండేల్ మూవీ కూడా సంక్రాంతికి బరిలో నిలుస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ రీసెంట్ గా తమ నిర్ణయాన్ని చేంజ్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి తర్వాత రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి ఛాన్స్ కొట్టేశారని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. తండేల్ తప్పుకోవడంతో.. సందీప్ కిషన్ మజాకా సినిమాకు మరిన్ని థియేటర్లు దొరుకుతాయని చెబుతున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోని 50 శాతానికి పైగా థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు విడుదల చేయాలని అనుకుంటున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. స్పెషల్ అండ్ బెనిఫిట్ షోలు కూడా వేయనున్నారట. అదే సమయంలో బాలయ్య మూవీకి 25 శాతం థియేటర్లు దక్కనున్నట్లు సమాచారం. మిగతా థియేటర్లలో మజాకా రిలీజ్ కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా.. రావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read Also:Hyderabad: చైతన్యపురి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు.. కిచెన్ పరిసరాల్లో మురుగు నీరు..