Site icon NTV Telugu

Sundeep Kishan : రెజీనాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సందీప్ కిషన్

Sa1

Sa1

Sundeep Kishan : సందీప్ కిషన్, రెజీనా కసాండ్రా ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇప్పటివరకు వార్త ప్రచారంలో ఉంది. కానీ సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వారి మధ్య ప్రేమ ప్రచారానికి బలాన్ని చేకూర్చుతోంది. రెజీనా పుట్టిన రోజు సందర్భంగా సందీప్‌ కిషన్‌ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఆయన ట్విట్టర్లో పుట్టినరోజు శుభాకాంక్షలు పాప. ఐ లవ్‌ యూ. ఎప్పుడూ నీకు మంచే జరగాలి అని ట్విట్టర్లో పేర్కొని నటి రెజీనాతో తను సన్నిహితంగా ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Read Also: Aishwarya: ముగ్గురు పిల్లలకు తల్లి కాబోతున్న ఐశ్వర్య

ప్రస్తుతం రెజీనా కసాండ్రా బహుభాషా కథానాయికగా రాణిస్తోంది. తమిళంలో కండనాళ్‌ ముదల్‌ చిత్రంతో 2017లో కథానాయకిగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న రెజీనా కేడి బిల్లా కిలాడి రంగ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత టాలీవుడ్‌కు పరిచయమైంది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ అమ్మడు ఎక్కువ చిత్రాలు చేసింది. అదేవిధంగా ఈ 32 ఏళ్ల అమ్మాయి ఇప్పటికి మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‎లర్‌గానే ఉంది. అయితే ఈ అమ్మడి ప్రేమ గురించి రకరకాలుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య ఒక టాలీవుడ్‌ యువ నటుడి ప్రేమలో గాఢంగా మునిగిపోయిందని ప్రచారం హోరెత్తింది. తాజాగా మరో యువ నటుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ బ్యూటీ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. మరి ఇలాంటి వార్తలపై నటి రెజీనా, సందీప్‌ కిషన్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Exit mobile version