NTV Telugu Site icon

Weather Department: నేటి నుంచి దంచికొట్టనున్న ఎండలు.. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్

High Temparecher

High Temparecher

Weather Department: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల వరకు పెరిగాయి. శివరాత్రి నాడు చలి తగ్గుతుందని చెబుతున్నప్పటికీ భూమిపై పెరుగుతున్న కాలుష్యం కారణంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. దీంతో ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండలు మొదలయ్యాయి.

ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ 10 గంటల లోపే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలకు ముందే సూర్యభగవానుడు ప్రజలపై నిప్పులు కురిపిస్తాడు. దీంతో మార్చి నెలలోనే ఇలా ఉంటే ఎండాకాలం మొత్తం ఎలా ఉంటుందోనని వాతావరణ శాఖ, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల వచ్చిందో లేదో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.

Read also: Srileela: శ్రీలీలా సినిమాలకు అందుకే గ్యాప్ తీసుకుందా?

తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఎండల కారణంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు ప్రకటిస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని స్పష్టం చేశారు.
నేటి నుంచి రానున్న 5 రోజుల పాటు ఎండలు (ఉష్ణోగ్రత) గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణం వైపు నుంచి రాష్ట్రంలోకి తక్కువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.

ఈ 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రాత్రిపూట కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దు. ఉదయం 12 గంటలలోపు తిరిగి వచ్చి 4 తర్వాత ఏదైనా పని చూసుకోండి.అంతేకాకుండా ఎండలో నడిచేవారు తప్పనిసరిగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.
Aravind Kejriwal : జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన.. మొదటి ఆదేశం జారీ