NTV Telugu Site icon

Special Trains : కాచిగూడ-కాకినాడ మధ్య స్పెషల్‌ ట్రైన్స్‌

Train

Train

కాచిగూడ – కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. వేసవి సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కాచిగూడ మరియు కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రైలు నెం. 07417 మే 13వ తేదీ రాత్రి 8:45 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరుతుంది. దీంతో పాటు మే 14వ తేదీ ఉదయం 8:40 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుని, రైలు నెం. 07418 మే 14వ తేదీ రాత్రి 9.55 గంటలకు కాకినాడ టౌన్ నుండి బయలుదేరుతుంది.

Also Read : BJP: బీజేపీకి గెలుపోటములు కొత్త కాదన్న యెడ్డీ… లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకుంటామన్న బొమ్మై

ఇదే కాకుండా.. మే 15 ఉదయం 9.45 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. రైళ్లలో AC II టైర్, AC III టైర్, స్లీపర్ III టైర్, సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. వేసవి రద్దీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Also Read : IB 71: మరోసారి నిరాశ పరిచిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్

Show comments