Site icon NTV Telugu

Summer: సమ్మర్ వచ్చేస్తుంది.. కాస్త చల్ల బడండి!

Summer

Summer

Summer: ఈ సారి సమ్మర్ ముందుగానే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఫిబ్రవరి మొదలు కాగానే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దానితో జనాలు కూడా అప్రమత్తం కావాల్సిన టైం వచ్చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. మన శరీరాన్ని డీహైడ్రేట్ అవకుండా చేసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అవి ఏంటంటే..

*పానీయాలు ఎక్కువ తీసుకోవాలి
మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నీళ్లు, సబ్జా నీళ్లు, బార్లీ వాటర్, ఇతర ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకుంటూ ఉండాలి. దాని వల్ల మన శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది.

*చల్లని నీటితో స్నానం చేయాలి
రోజంతా ఇంటి బయట ఉండడం వల్ల ఎండకి శరీరం చమటలో మునిగి తేలుతుంది. అందుకే చల్లని నీటితో స్నానం రెండు పూటలా చేయాలి. దీని వల్ల వేసవి తాపం నుండి రిలీఫ్ పొందవచ్చు.

*సీజనల్ ఫుడ్స్ మాత్రమే తినాలి
ఎండా కాలంలో సీజనల్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. వేరే సీజన్లలో తిన్నట్టు తినకూడదు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. మసాలాలు తక్కువ తినాలి. త్వరగా జీర్ణం అయ్యే ఆహరం తీసుకోవాలి. టమాటాలు, బెర్రీలు, పుచ్చకాయ, కీర వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల హైడ్రేట్‌గా.. శరీరం చల్లగా ఉంటుంది.

*లూస్ గా ఉండే దుస్తులు ధరించాలి
సమ్మర్‌లో టైట్‌గా ఉండే బట్టల వేసుకోవద్దు. కాటన్, లూస్ గా ఉండే దుస్తులు వేసుకుంటే వేడి తక్కువగా అనిపిస్తుంది.

Exit mobile version