NTV Telugu Site icon

Punjab: శిరోమణి అకాలీదళ్ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ రాజీనామా..

Sukhbir Singh Badal

Sukhbir Singh Badal

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్ష పదవికి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (62) శనివారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పంజాబ్‌ మాజీ విద్యాశాఖ మంత్రి దల్జిత్‌ ఎస్‌ చీమా ట్వీట్‌ చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికకు మార్గం సుగమం చేసేందుకు ఎస్‌ఎడి అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈరోజు పార్టీ వర్కింగ్ కమిటీకి తన రాజీనామాను సమర్పించినట్లు చీమా ట్వీట్ చేశారు. ఇటీవ‌ల సిక్కు మ‌త పెద్ద‌లు సుఖ్‌బీర్‌ను టంక‌య్య‌గా డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఆయ‌న‌కు శిక్ష ప‌డాల్సి ఉంది. సిక్కు మ‌త సూత్రాల‌ను ఉల్లంఘించిన వారిని టంకయ్య‌గా పేర్కొంటారు. ఆ కేసులో దోషిగా తేలిస్తే, ఆ మ‌త ఆచారం ప్ర‌కారం శిక్ష వేస్తారు.

Read Also: Director Death: సినీ పరిశ్రమలో విషాదం.. దర్శకుడు మృతి!

తన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినందుకు.. పదవీకాలం మొత్తం హృదయపూర్వక మద్దతు, సహకారాన్ని అందించినందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. తదుపరి కార్యాచరణపై చండీగఢ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అకాలీదళ్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ భుందార్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. అకాలీదళ్‌ అధ్యక్ష, ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గ సమావేశానికి డిసెంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి.

Read Also: Bengaluru: రైడ్ క్యాన్సిల్.. ఆటో డ్రైవర్, యువతి మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్..