Site icon NTV Telugu

Sujeeth: ఆ సినిమాతోనే నా ప్రయాణం మొదలు.. ‘జానీ’ లేకపోతే నేను లేను

Sujith

Sujith

Sujeeth: నేడు హైదరాబాద్ లో జరిగిన OG సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. ‘జానీ’పై భారీ అంచనాలతో థియేటర్‌కు వెళ్లానని, కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదని, కొన్నాళ్ల పాటు హెడ్ బ్యాండేజ్ కట్టుకుని తన నిరాశను వ్యక్తం చేశానని చెప్పాడు. ఇక ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్‌లో సుజీత్ మరోసారి ‘జానీ’ సినిమా గురించి మాట్లాడాడు. జానీ లాంటి సినిమా లేకపోతే, నాలాంటి దర్శకుడు పరిశ్రమలోకి వచ్చి ఉండడని సుజీత్ అన్నారు. తమ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన వాల్‌పేపర్‌గా ‘జానీ’ సినిమా స్టిల్స్‌ను పెట్టుకుంటాడని చెబుతూ, ఆ అభిమానిని కూడా సుజీత్ పరిచయం చేశాడు.

Off The Record: ఆ టీడీపీ నేతలు వైసీపీతో కలిసి పార్టీని తగలెట్టేస్తున్నారా?

అలాగే, నేను కథలు రాస్తున్నప్పుడు కూడా నా మనసులో జానీ సినిమా ఉంది. ఈ విషయం నేను కళ్యాణ్ గారికి ఎప్పుడూ చెప్పలేదు. అంతలా నన్ను స్ఫూర్తినిచ్చిన సినిమా ‘జానీ..’ అని సుజీత్ అన్నాడు. ‘జానీ’ సినిమా స్టిల్స్‌తోనే తాను ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టానని సుజీత్ చెప్పాడు. సుజీత్‌తో పాటు, మరో దర్శకుడు బండి సరోజ్ కుమార్ కూడా గతంలో ‘జానీ’, ‘ఒక్కడు’ సినిమాలు తనను దర్శకుడిగా బాగా ప్రభావితం చేశాయని చెప్పడం ఈ సినిమాకున్న ప్రాముఖ్యతను తెలుపుతుంది. కమర్షియల్ విజయాన్ని అందుకోకపోయినా, ఒక తరం దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ‘జానీ’ సినిమాకు ‘ఓజీ’ సక్సెస్ మీట్‌లో దక్కిన ఈ గౌరవం పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది.

NCRB Report: దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రం ఇదే.. తాజా నివేదిక..

Exit mobile version