NTV Telugu Site icon

Suhasini: రజనీ-మణిరత్నం కాంబోలో సినిమా.. క్లారిటీ ఇచ్చిన సుహాసిని!

Rajinikanth Mani Ratnam

Rajinikanth Mani Ratnam

Rajinikanth-Mani Ratnam’s Movie Update: 1991లో సూపర్ స్టార్ రజనీకాంత్‌, దర్శకుడు మణిరత్నం కలయికలో వచ్చిన ‘దళపతి’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. 33 ఏళ్ల తర్వాత ఈ హిట్‌ కాంబోలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగాయని.. అన్నీ కుదిరితే డిసెంబరులో సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశముందని వార్తలు చక్కర్లు కొట్టాయి.ఈ వార్తలపై నటి, మణిరత్నం సతీమణి సుహాసిని స్పందించారు.

రజనీకాంత్‌, మణిరత్నం కలయికలో సినిమా అంటూ వస్తున్న వార్తలు రుమార్స్‌ మాత్రమే అని సుహాసిని చెప్పారు. ఓ జాతీయ మీడియాతో సుహాసిని మాట్లాడుతూ… ‘రజనీకాంత్‌, మణిరత్నం కలయికలో సినిమా లేదు. అవి కేవలం రుమార్స్‌ మాత్రమే. బహుశా ఈ విషయం వాళ్లిద్దరికీ కూడా తెలిసి ఉండదేమో. రజనీ, మణిరత్నం సినిమా అంటూ జనాలు మాత్రమే రాస్తున్నారు’ అని సుహాసిని క్లారిటీ ఇచ్చారు. మరి ఈ హిట్‌ కాంబో ఎప్పుడో పునరావృతం అవుతుందో చూడాలి. రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయన్‌’ దసరాకు విడుదలైన విషయం తెలిసిందే.

Also Read: Kohli-Rohit: విరాట్ కోహ్లీతో పోస్టర్.. రోహిత్‌ శర్మ ఫ్యాన్స్ ఫైర్!

రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం 2025లో థియేటర్లలోకి రానుంది. జైలర్‌ 2 పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. మరో ఇద్దరు యువ దర్శకులు రజనీ కోసం కథలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు మణిరత్నం ప్రస్తుతం కమల్‌ హాసన్‌తో ‘థగ్‌ లైఫ్‌’ చేస్తున్నారు. 1987లో వచ్చిన నాయకన్‌ (నాయకుడు) తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న సినిమా ఇది.

 

 

Show comments