NTV Telugu Site icon

Suhas: రైటర్ పద్మభూషణ్.. ఈసారి ‘శ్రీరంగ నీతులు’ చెప్తాడట

Suhas

Suhas

Suhas: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు సుహాస్. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. కష్టపడి ఎదిగిన నటుల్లో సుహాస్ ఒకడు. ఇక హీరోగానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా, సపోర్టివ్ రోల్స్ లో సైతం కనిపించి మెప్పిస్తున్నాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ గా అభిమనుల ముందుకొచ్చి భారీ హిట్ ను అందుకున్న సుహాస్.. మరోసారి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే శ్రీరంగ నీతులు. సుహాస్ తో పాటు కార్తీక్ రత్నం కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నాడు. ఇక ఈ చిత్రంలో రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Trivikram: బ్రో టీజర్ లో పూజా హెగ్డే.. ఆడేసుకుంటున్న నెటిజన్స్

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సుహాస్, కార్తీక్ రత్నం, రుహనీ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే సుహాస్ సినిమా అంటే.. కచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుంది. విభిన్నమైన కథలను మాత్రమే అతడు సెలెక్ట్ చేసుకుంటాడు అని ప్రేక్షకుల మనసుల్లో ముద్ర పడిపోయింది. దీంతో పోస్టర్ రిలీజ్ అవ్వగానే సినిమాపై అంచనాలను పెట్టేసుకున్నారు. ఇక సుహాస్ లానే కార్తిక్ రత్నం కూడా కష్టపడి పైకి వస్తున్న నటుడు. ఈ మధ్యనే వ్యవస్థ అనే సిరీస్ తో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. వీరి కాంబో లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

Show comments