Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే పండుగల సీజన్లో చక్కెర కృత్రిమ కొరతను నివారించి, వినియోగదారులకు అందుబాటు ధరల్లో చక్కెర లభించేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వచ్చి నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం.. చక్కెర వ్యాపారులు, డీలర్లు గరిష్టంగా 1,000 క్వింటాళ్ల నిల్వలను మాత్రమే కలిగి ఉండాలి. అలాగే తాము కొనుగోలు చేసిన సరుకును 15 రోజుల వ్యవధిలోనే మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది.
అంతకుముందు ఆగస్టులో ఈ పరిమితి 4,000 క్వింటాళ్లు (30 రోజులు) కాగా, సెప్టెంబర్‌లో 2,000 క్వింటాళ్లకు తగ్గించారు. ఇప్పుడు దీనిని మరింత కఠినతరం చేస్తూ 1,000 క్వింటాళ్లకు కుదించారు. అయితే, భౌగోళిక రవాణా ఇబ్బందులు, సుదూర ప్రాంతాల సరఫరా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా, దాని పరిసర మెట్రో ప్రాంతాలతో పాటు అసోం రవాణా మార్గాలకు ఈ నిబంధనలో ప్రత్యేక మినహాయింపునిచ్చారు. అక్కడ వ్యాపారులు గరిష్టంగా 2,000 క్వింటాళ్ల వరకు సరుకును నిల్వ చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది.
Also Read
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
- Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
వ్యాపారులు భారీగా చక్కెరను నిల్వ చేసి సరుకు కొరత సృష్టించకుండా నిరోధించడం, మిల్లుల నుంచి మార్కెట్‌కు చక్కెర సరఫరా వేగవంతం చేయడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం. దసరా, దీపావళి పండుగల వేళ తీపి పదార్థాల తయారీకి చక్కెర వినియోగం విపరీతంగా పెరుగుతుంది. ఇటీవల ఎక్స్-మిల్ ధరకు తోడు రిటైల్ మార్కెట్లో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో, వ్యాపారులు ఈ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా పండుగల వేళ ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని కేంద్రం భావిస్తోంది.
తాజావార్తలు
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
-
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
-
Chief Selector: ఆ మాజీ ప్లేయర్‌కు బీసీసీఐ ప్రమోషన్..? చీఫ్ సెలెక్టర్ రేసులో కొత్త ట్విస్ట్..
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..