Healthy Breakfast : వంట చేసే టైమ్ లేదా? రాత్రి ఈ 4 వస్తువులు నానబెడితే చాలు.. ఉదయానికి అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ వండుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే చాలా మంది సమయం లేక టిఫిన్ మానేస్తుంటారు లేదా బయట దొరికే జంక్ ఫుడ్‌పై ఆధారపడుతుంటారు. అలాంటి వారి కోసం ‘ఓట్స్ చియా పుడ్డింగ్’ ఒక అద్భుతమైన ఎంపిక. దీనికి వంట చేయాల్సిన అవసరం లేదు, కేవలం రాత్రి నానబెడితే చాలు.. ఉదయానికి పోషకాల గని సిద్ధమవుతుంది. చక్కెర వాడకుండా తయారుచేసే ఈ పుడ్డింగ్ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
తయారీ విధానం- కావలసిన పదార్థాలు :
ఒక గాజు జార్‌లో అర కప్పు రోల్డ్ ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ చియా గింజలు, ముప్పావు కప్పు పాలు (బాదం పాలు కూడా వాడుకోవచ్చు) మీకు నచ్చిన పండ్ల ముక్కలు (ఆపిల్, అరటి లేదా బెర్రీలు) వేసి బాగా కలపాలి. దీన్ని మూత పెట్టి రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచితే, మరుసటి రోజు ఉదయానికి హెల్తీ పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. తీపి కావాలనుకునే వారు చక్కెర బదులు ఖర్జూరం లేదా కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రిజ్‌లో రెండు రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇందులో మనం అదనపు చక్కెరను ఏమాత్రం వాడటం లేదు. పండ్లలోని సహజ తీపి దీనికి మంచి రుచిని ఇస్తుంది. కనుక ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది.
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఆరోగ్య ప్రయోజనాలు :
చియా గింజలు పాలలోని తేమను పీల్చుకుని జెల్ లాగా మారుతాయి. ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది. ఓట్స్ శరీరానికి కావాల్సిన శక్తిని నెమ్మదిగా, స్థిరంగా విడుదల చేస్తాయి. దీనివల్ల ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నీరసం రాకుండా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా చియా గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో.. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
గమనిక: ఏదైనా కొత్త ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకునే ముందు మీ శరీర తత్వానికి అది సరిపోతుందో లేదో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోవడం ఉత్తమం.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!