Site icon NTV Telugu

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ‘G.O.A.T’ సెన్సార్ పూర్తి.. బాక్సాఫీస్ వద్ద సునామీకి ముహూర్తం ఫిక్స్!

Goat

Goat

Sudigali Sudheer: బుల్లితెర మెగాస్టార్, వెండితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘G.O.A.T’ (Greatest of All Time). యాక్షన్, కామెడీ, ఎమోషన్ కలయికతో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా అలరించనుందని స్పష్టమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ ‘మహాతేజ క్రియేషన్స్’ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్‌ను విడుదల చేస్తూ.. “మార్చి 26 నుంచి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సినిమాటిక్ స్టార్మ్ మొదలవబోతోంది” అని ప్రకటించింది.

READ ALSO: Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే 4గురు మృతి..

తాజాగా విడుదలైన పోస్టర్‌లో సుధీర్, హీరోయిన్ దివ్య భారతి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుధీర్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఇందులో క్లాస్ లుక్‌లో కూడా మెప్పించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్, దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, మొగుళ్ల చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేదవ్యాస్ అకుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లియన్ జేమ్స్ – మనీష్ శర్మ సంగీతం అందిస్తున్నారు. మహాతేజ క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

READ ALSO: Srikanth Odela: ‘ప్యారడైజ్’ సినిమాలో మోహన్ బాబు విశ్వరూపం ఆ రోజు తెలుస్తుంది: శ్రీకాంత్ ఓదేల

Exit mobile version