Site icon NTV Telugu

Sudheer Babu-Mahesh Babu: మహేష్ బాబుకి సుధీర్ బాబు ఫోన్.. ఏం మాట్లాడుకున్నారంటే?

Mahesh Babu And Sudheer Babu

Mahesh Babu And Sudheer Babu

Mahesh Babu and Sudheer Babu Audio Clip: సుధీర్‌ బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక రూపొందిస్తున్న చిత్రం ‘హరోం హర’. ఈ సినిమాను సుమంత్‌ జి.నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక కాగా.. సునీల్‌ ముఖ్య పాత్ర పోషించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రం జూన్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్ 11) రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సుధీర్‌ బాబు కాల్ చేశారు. ఇందుకు సంబధించిన ఓ ఆడియో కాల్ నెట్టింట వైరల్ అయింది.

హరోం హర సినిమా జూన్ 14న రిలీజ్ అవుతోంది, ఆ సినిమాకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను అని మహేష్ బాబుతో సుధీర్‌ బాబు అన్నారు. ‘అందరికి నమస్కారం. హరోం హర టీంకు ఆల్ ది బెస్ట్. సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఎంతలా కష్టపడ్డారో తెలుస్తోంది’ అని సూపర్ స్టార్ అన్నారు. సినిమాలో షూటింగ్ లేదా ట్రైనింగ్‌కి సంబందించి గన్స్‌తో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని సుధీర్ అడగ్గా.. ‘ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. కానీ టక్కరి దొంగ సినిమాలో మొదటిసారి వాడాను. చాలా గన్స్‌ వాడాను. మోసగాళ్లకు మోసగాడు సినిమా గుర్తొచ్చింది’ అని మహేష్ చెప్పారు.

Also Read: Harom Hara Movie: క్లైమాక్స్‌ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!

గన్స్‌ను బాగా హ్యాండిల్ చేసిన మీ ఫేవరేట్ యాక్టర్ ఎవరు అనే ప్రశ్నకు ‘మీ అందరికీ తెలిసిందే. నాన్న గారే. మోసగాళ్ళకు మోసగాడు సినిమా వంద సార్లు చూసి ఉంటాను’ అని మహేష్ బాబుతో సుధీర్‌ బాబుతో అన్నారు. హరోం హర సినిమాలో ఓ గన్‌కు కృష్ణ గారి పేరు పెట్టాం అని సుధీర్‌ చెప్పారు. హరోం హరలో మీకు నచ్చిన పాట ఏది అని సుధీర్‌ అడగ్గా.. ‘టైటిల్ ట్రాక్ బాగుంది. నీక్కూడా మెసేజ్ చేసాను’ అని జవాబిచ్చారు. ట్రైలర్‌లో నీకు నచ్చిన ఎలివెంట్స్ ఏంటి అనే ప్రశ్నకు.. ‘నువ్వు కొత్తగా కనిపించావు. స్టోరీ బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంది. అబిమానులకు నచ్చుతుంది’ అని తెలిపారు. మహేష్ ఆడియో క్లిప్‌ను సుధీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

 

Exit mobile version