Site icon NTV Telugu

Sudha Kongara : ఫేక్ ఐడీలు, నెగటివ్ రివ్యూలు.. విజయ్ ఫ్యాన్స్‌పై సుధా కొంగర ఫైర్!

Sudha Kongara, Vijay Fans, Parashakthi Movie

Sudha Kongara, Vijay Fans, Parashakthi Movie

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం శివకార్తికేయన్‌, విజయ్‌ దళపతి అభిమానుల మధ్య కోలీవుడ్ వార్ నడుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాపై విజయ్ అభిమానులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర దర్శకురాలు సుధా కొంగర మండిపడింది. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ఫేక్ ఐడీలతో నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని, తమ సినిమాను దెబ్బతీయడానికి నీచమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము ప్రస్తుతం రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Also Read : Anil Ravipudi: నిర్మాతకు కారు.. నాకు విల్లా: అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్!

ఈ వివాదం వెనుక బలమైన రాజకీయ కారణాలు కూడా కనిపిస్తున్నాయి. విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ చిత్రానికి సెన్సార్ అనుమతి లభించకపోగా, ‘పరాశక్తి’ చిత్రానికి మాత్రం చివరి నిమిషంలో లైన్ క్లియర్ అయ్యింది. పైగా ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ పంపిణీ చేయడంతో, తమ హీరో సినిమాను అడ్డుకోవడంలో రాజకీయ కుట్ర ఉందని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కోపంతోనే వారు ‘పరాశక్తి’ పై నెగిటివ్ రివ్యూల దాడి మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పొంగల్ రేసులో సినిమా బాగున్నా ఇలాంటి ఫ్యాన్ వార్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరమని సుధా కొంగర ఆవేదన వ్యక్తం చేశారు.

Exit mobile version