తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం శివకార్తికేయన్, విజయ్ దళపతి అభిమానుల మధ్య కోలీవుడ్ వార్ నడుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాపై విజయ్ అభిమానులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర దర్శకురాలు సుధా కొంగర మండిపడింది. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో ఫేక్ ఐడీలతో నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారని, తమ సినిమాను దెబ్బతీయడానికి నీచమైన పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము ప్రస్తుతం రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం’ అంటూ ఆమె…