NTV Telugu Site icon

Hyderabad: మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు..

Hyd

Hyd

హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్ జోన్లో బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు హోటల్స్‌ల లైసెన్స్‌లను పోలీసులు తనిఖీ చేశారు. బార్లు పబ్బులలో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్ఎంసి పర్మిషన్‌లను మాదాపూర్ పోలీసులు చెక్ చేశారు. అనంతరం.. పబ్, బార్లలో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లై చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బార్లు, పబ్బులలో గంజాయి డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

Read Also: Gold Record price: పశ్చిమాసియా ఎఫెక్ట్.. ఆల్ టైం రికార్డు స్థాయిలో పసిడి ధరలు

ఇదిలా ఉంటే.. నగరంలోని పలు పబ్‌లలో నిన్న రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గత కొంతకాలంగా యువతులను ఎరగా వేసి యువకులతో భారీగా మద్యం తాగించి వారు మద్యం మత్తులోకి జారుకోగానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్‌ పోలీసులు.. కొన్ని పబ్‌లపై దాడులు చేశారు. నిన్న బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్- 3లోని టాస్‌ పబ్‌లో అర్ధనగ్న నృత్యాలు చేస్తు్న్న కొందరు యువతులను పట్టుకున్నారు. అలాగే.. కొందరు యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే, పబ్‌ యజమానులు బింగి బలరాం గౌడ్, బింగి శ్రీనివాస్‌గౌడ్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also: PKL 11: తెలుగు టైటాన్స్ మరో ఓటమి..