కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు.. మహా పురుషులు అవుతారు.. ఇది అక్షర సత్యం.. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవడు బికారి అయినట్లు చరిత్రలో లేదు.. పెద్ద పెద్ద చదువులు చదివిన సరైన ఉద్యోగాలు లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.. అలాగే సరిగ్గా కుటుంబ పోషణకు సరిపోకవడంతో ఉద్యోగాలను వదిలేసి వ్యాపారాన్ని చేస్తున్నారు.. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.అలా చాలా మంది వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలను సాధించి చూపించారు.ఇది నిజంగా గ్రేట్.. ఇప్పుడు ఓ యువ రైతు కూడా వ్యవసాయాన్ని ఎంచుకోని లక్షలను అందుకుంటున్నాడు. అతను తన బడ్జెట్ లో పుట్టగొడుగులను పండించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు.. ఆ రైతు గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని వాకలవలస గ్రామానికి చెందిన యువరైతు గౌతమ్. మొదట అవగాహన లేమితో తడబడ్డాడు. సమస్యకు కారణమేంటో తెలుసుకున్నాడు.ఎలాగైనా పడిన చోటే లేచి నిలబడాలన్న నిర్ణయానికి వచ్చాడు.డబ్బులు సంపాదించాలనే తపనతో మరో అడుగు ముందుకు వేశాడు.. అతను కేవలం రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించాడు గౌతమ్. సీజన్ కు వచ్చే వాతావరణ మార్పులను అనుసరించి రెండు రకాల పుట్టగొడుగులను పెంచుతున్నాడు. 6 నెలలు ముత్యపు చిప్ప పుటట్టగొడుగులో మరో ఆరు నెలలు మిల్కీ మష్‌రూమ్స్ పెంపకం చేస్తున్నాడు..
వ్యాపారాన్ని మొదలు పెట్టిన మొదట్లో కాస్త ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.. ఆ తర్వాత మూడో ఏడాదికల్లా అధిక లాభాలను అందుకున్నాడు..ఇప్పుడు నెలకు అన్నీ ఖర్చులు పోగా 60 వేలు ఆదాయాన్ని అందుకుంటున్నాడు. కొత్తగా వచ్చేవారు తక్కువ పెట్టుబడితో పెంపకం మొదలుపెట్టాలన్నారు.. అతను పుట్టగొడుగులకు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉందని తెలుస్తుంది.. లక్షల్లో ఆదాయాన్ని పొందుతూ పదిమందికి ఉపాదిని కల్పిస్తున్నారు..