NTV Telugu Site icon

Mopidevi: కన్నులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం

Mopidevi

Mopidevi

Mopidevi Subramanya Swamy Kalyana Mahostavam: కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్వామివారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ షష్టి మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారిని వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పెళ్లికుమారుడిని చేశారు. ఈ సందర్భంగా సుదీర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణ షష్టి మహోత్సవాలను తిలకించారు. ఈసందర్భంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లను దేవాలయ కార్య నిర్వహణ అధికారి దాసరి శ్రీరామ్‌ప్రసాద్ పర్యవేక్షించారు.

Read Also: Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం.. విగ్రహం ఫోటో చూసారా..?

Show comments