NTV Telugu Site icon

Uttarakhand : విద్యార్థుల వీరంగం.. వార్డెన్ పై వేధింపులే కారణం!

Students Protest

Students Protest

ఉత్తరాఖండ్ లోని ఉత్తరాంచల్ యూనివర్సిటీ విద్యార్థులు వీరంగం సృష్టించారు. ఓ మహిళ వార్డెన్ వేధింపులకు గురైందని విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయమై విశ్వవిద్యాలయం అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. క్యాంపస్ పరిసరాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Also Read : WPL 2023 : నేడు గుజరాత్‌ జాయింట్స్‌ తలపడనున్న యూపీ వారియర్స్‌

ఉత్తరాంచల్ యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ తనను వేధింపులకు గురిచేశాడని దర్శల్ అనే మహిళ వార్డెన్ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా యాజమాన్యం పట్టించుకోలేదు.. దీంతో చీఫ్ వార్డెన్ పై తగిన చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు అసంతృప్తికి గురి అయ్యారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థులు.. యూనివర్సిటీకి చెందిన యూఐటీ కాలేజీ వద్ద విధ్వంసం సృష్టించారు. బైక్ లను కర్రలతో పగులగొట్టారు. అందరూ ఒక చోట గుమిగూడి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.

Also Read : Ap Assembly : ఏపీలో ఆందోళనలు.. అసెంబ్లీ ముట్టడికి పిలుపు

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. కానీ, పోలీసులు క్యాంపస్ లోకి రాకుండా విద్యార్థులు గేట్ కు తాళం వేశారు. మహిళ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి యూనివర్సిటీ యాజమాన్యం ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పారు. ఒకవేళ వారు ఫిర్యాదు చేస్తే..దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. క్యాంపస్ లో ఇలాంటివి చేయకుడదని పోలీసులు విద్యార్థులకు తెలియజేశారు. ఎదైన సమస్య ఉంటే తమ వద్దకు రావాలని వెల్లడించారు. సమస్యలుంటే శాంతియుతంగా నిరసనలు చేయాలి తప్ప ఇలాంటి అసంఘీక చర్యలకు పాల్పడొద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో వార్డెన్ కు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.