Gang War: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై రైల్వే స్టేషన్ లో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ జరిగింది. విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్ళు, కర్రలతో కోట్టుకుంటూ రెచ్చిపోయారు. పట్టరవాక్కం రైల్వే స్టేషన్‌లో పచ్చయ్యప్పన్ కళాశాల, ప్రెసిడెన్సీ కాలేజ్ స్టూడెంట్స్ లోకల్ ట్రైన్ నిలిపి వేసి పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోపై నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Farmers Protest 2024: సానుకూలంగానే చర్చలు.. రైతు సంఘాలతో ఆదివారం మరోసారి సమావేశం!
అయితే, ఓ అమ్మయి విషయంలో ఇరు వర్గల మధ్య గోడవ చోటు చేసుకుంది. గతంలో బస్సుల్లో, రైళ్లో కర్రలతో దాడులు చేసుకున్న విద్యార్థులు.. ఈ సారి ఏకంగా రైల్వే స్టేషన్ లోనే ఇలా దాడులు చేసుకున్నారు. స్టూడెంట్స్ చేస్తున్న నానా హంగామా చూసిన ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ ఘటనలో దాదాపు 15 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో యాబై మందికి పైగా స్టూడెంట్స్ పాల్గొన్నట్లు సమాచారం. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
