NTV Telugu Site icon

Aparna Balamurali: హీరోయిన్‌తో స్టూడెంట్ మిస్‌బిహేవ్

Aparna Balamurali

Aparna Balamurali

Aparna Balamurali: మ‌ల‌యాళ నటి, ‘ఆకాశ‌మే నీ హాద్దురా’ హీరోయిన్ అప‌ర్ణ బాల‌ముర‌ళికి చేదు అనుభ‌వం ఎదురైంది. ఓ స్టూడెంట్ ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ‘తాంకం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ ఓ కాలేజీలో వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఓ స్టూడెంట్ అత్యుత్సాహంతో అప‌ర్ణ బాల‌ముర‌ళి భుజంపై చేయివేయ‌డానికి ప్రయత్నించాడు. మొదట హీరోయిన్‌కు ఫ్లవర్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఆ స్టూడెంట్ ఆ త‌ర్వాత ఆమె భుజంపై చేయివేశాడు. దీంతో ఒక్కసారిగా అతడి ప్రవర్తనతో అప‌ర్ణ ఇబ్బందిగా ఫీల‌య్యింది. ఆ స్టూడెంట్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి ట్రై చేసింది.

Read Also: Gold and Silver Price: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన పసిడి ధర.. వెండిది అదే దారి..

అయితే, ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ స‌మ‌యంలో చిత్ర యూనిట్‌తో పాటు కాలేజీ మేనేజ్‌మెంట్ అక్కడే ఉన్న ఆ స్టూడెంట్ చేస్తోన్న ప‌నిని అడ్డుకోక‌పోవ‌డంపై నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో న‌ట‌న‌కుగానూ అపర్ణ జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. మ‌ల‌యాళంలో బిజీ హీరోయిన్‌గా కొన‌సాగుతోన్న అప‌ర్ణ బాల‌ముర‌ళి.. ప్రస్తుతం ఫ‌హాద్ ఫాజిల్‌తో హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ధూమంలో న‌టిస్తోంది. ఈ చిత్రంతో పాటు మ‌రో ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి జోరుమీదుందీ ఈ హీరోయిన్.

Show comments